NDL: జిల్లాల్లో కుండపోత వర్షాలతో జనజీవనం సాగించలేకపోతున్నారు. గోనెగండ్లలో మల్లెలవాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఆదోనిలో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చింతమానుపల్లెలో రెండు మట్టి మిద్దెలు కూలగా, ఆత్మకూరులో చెరువు జోరుతో కర్నూలు నుంచి శ్రీశైలం, విజయవాడ వెళ్లేవారు నంద్యాల మార్గం ఉపయోగించాలని పోలీసులు సూచించారు.