ATP: విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు. నవరాత్రుల సందర్భంగా ఉదయం ఆమె అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.