SRD: సిర్గాపూర్ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 7మంది లబ్ధిదారులకు CMRF చెక్కులను MLA సంజీవరెడ్డి శుక్రవారం రాత్రి అందజేశారు. లబ్ధిదారులు ఆసుపత్రి అత్యవసర వైద్య ఖర్చులకుగాను CM సహాయ నిధికి దరఖాస్తు పెట్టుకోగా 7 మందికి కలిపి రూ. 2.15 లక్షలు నిధులు మంజూరయ్యాయి. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. ఇందులో మాజీ సర్పంచ్లు ఉన్నారు.