ప్రకాశం: కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ 15వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వార్డు ప్రజలు డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. మంజూరైన పనులనుననాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని ఛైర్మన్ అధికారులను, కాంట్రాక్టులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మాణిక్యరావు పాల్గొన్నారు.