W.G: జిల్లాలో ఖరీఫ్ సీజన్ 2025-26లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ ఆదేశించారు. భీమవరం భారతీయ విద్యా భవన్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్స్ ప్రతినిధులు, జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.