ప్రకాశం: పొదిలి మండలం కంబాలపాడు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. మృతులు హనుమంతునిపాడుకు చెందిన బ్రహ్మయ్య, వెలిగండ్లకు చెందిన విష్ణుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరూ విజయవాడలో చదువుతున్నారు. దసరా సెలవులు ఇవ్వడంతో బైక్ పై ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో వాహనం ఢీకొని చనిపోయారు.