ELR: నూజివీడులో 69వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు 6వ రోజు అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ నడిబొడ్డులో వేంచేసి ఉన్న శ్రీకోట మహిషాసుర మర్దిని అమ్మవారు ఇవాళ శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేకపూజలు చేస్తున్నారు.