ELR: కలెక్టరేట్లోని గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా స్థాయీ ఇసుక కమిటీతో పాటు సంబంధిత అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఉచిత ఇసుక పంపిణీ విధానంతో ప్రజలకు ఏటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సులభతరంగా అందేలా చూడాలన్నారు. ప్రజలకు ఇసుక పంపిణీలో అవకతవకలకు పాల్పడినా చర్యలు తప్పవని తెలిపారు.