WGL: వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఈ నెల 27వ తేదీ నుంచి 9 రోజుల పాటు మూసివేస్తున్నట్లు శుక్రవారం మార్కెట్ అధికారులు తెలిపారు. 27, 28 తేదీలలో వారాంతపు సెలవులు, 29న గుమస్తాల అభ్యర్థన మేరకు, 30న దుర్గాష్టమి, అక్టోబర్ 1న మహర్నవమి, 2న విజయదశమి, గాంధీ జయంతి, 3న పిల్ల దసరా, 4, 5 తేదీలలో వారాంతపు సెలవులు కారణంగా మార్కెట్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.