ఆసియా కప్‌లో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. భారత్ నిర్దేశించిన 203 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో శ్రీలంక 202/5 పరుగులకే పరిమితమైంది. చివరి ఓవర్లో శ్రీలంక విజయానికి 12 పరుగులు అవసరం కాగా, హర్షిత్ రాణా బౌలింగ్‌లో 11 పరుగులు మాత్రమే చేసింది. స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్వహించనున్నారు.