తూర్పు గోదావరి జిల్లాలో లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్ ట్రాఫిక్ విధులకు నూతనంగా కేటాయించబడిన 42 ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన ద్విచక్ర వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.