JGL: పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని పీసీసీ మెంబర్ తొట్ల అంజయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మందికి రూ.15.27 లక్షలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.