KRNL: పంట రుణాల మంజూరులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బ్యాంకర్లకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. కర్నూలు జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉందన్నారు.