KNR: కరీంనగర్ రెవెన్యూ గార్డెన్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి, వారసత్వానికి బతుకమ్మ పండుగ నిలుస్తుందని తెలిపారు.