W.G: మహిళలు, పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరిచే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ ‘స్వస్థ నారి సశక్తి పరివార్’ కార్యక్రమాన్ని ప్రారంభించారని ఎంపీ పాకా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం కొనితివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ శిబిరంలో 285 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు.