SRD: జిల్లాలో 216 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ప్రజలకు కలెక్టర్ మాధురి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. పిఎసిఎస్ ఆధ్వర్యంలో 88, ఐకేపి -101, డీసీఎంఎస్- 26, ఎఫ్ పిఓ-1 కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.