సూపర్ ఓవర్లో శ్రీలంక జట్టు కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్ అర్ష్దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి, 5 బంతుల్లోనే 2 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో శ్రీలంక ఇన్నింగ్స్ ముగిసింది. శ్రీలంక బ్యాటర్లు కుశాల్ పెరెరా (0), కమింద్ మెండిస్ (1), దాసున్ షనక (0) పరుగులు చేశారు. ఒక రన్ వైడ్ రూపంలో లభించింది.