W.G: భీమవరం మండల న్యాయ సేవా సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం పాలకోడేరు మండలం విస్సాకోడేరు గ్రామంలోని శిశుగృహ కేంద్రాన్ని మొదటి తరగతి మేజిస్ట్రేట్ జ్యోతి సందర్శించారు. శిశుగృహలో ఉన్న చిన్నారుల బాగోగుల కోసం తీసుకుంటున్న చర్యల గురించి POIC మమతను అడిగి తెలుసుకున్నారు. దత్తత పత్రాలను, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ప్యానల్ న్యాయవాదులు, తదితర అధికారులు పాల్గొన్నారు.