AKP: ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వచ్చేనెల 4వ తేదీన జరుగుతుందని జడ్పీ సీఈవో నారాయణమూర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జడ్పీ ఛైర్ర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగే సమావేశానికి జిల్లాలోని అన్ని శాఖల అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలని కోరారు. అలాగే జడ్పిటిసిలు ఎంపీపీలు ఇతర గౌరవ సభ్యులకు ఆహ్వానాలు అందజేసినట్లు పేర్కొన్నారు.