SRD: మూడు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ సంగారెడ్డిలోని చాకలి ఐలమ్మ విగ్రహం ముందు పంచాయతీ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చాకలి ఐలమ్మ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు. జిల్లా అధ్యక్షుడు సత్తయ్య మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి వేతనాలు రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు.