KKD: దసరా పండగ రద్దీ నేపథ్యంలో ఈ నెల 28న కాకినాడ టౌన్ నుంచి హెచ్ఎస్ నాందేడ్(07090)కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది సామర్లకోట, రాజమహేంద్రవరం, తణుకు, భీమవరం టౌన్, విజయవాడ, గుంటూరు, నల్గొండ, చర్లపల్లి, బాసర మీదుగా నడుస్తుందన్నారు.