TG: MGBSను మూసీ వరద నీరు ముంచెత్తడంతో అధికారులు రాకపోకలు నిలిపివేశారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు ఎంజీబీఎస్ ను తాత్కాలికంగా మూసివేశారు. ముందుగా రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల పికప్ పాయింట్లలో మార్పు చేసి సంక్షిప్త సమాచారం ద్వారా వారికి తెలియజేస్తున్నారు.