AP: శాసనమండలిలో మరోసారి ప్రోటోకాల్ రగడ నెలకొంది. మండలి ఛైర్మన్‌పై ప్రభుత్వం వివక్ష చూపుతోందని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఛైర్మన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. కనీసం శాసనసభ, మండలి క్యాంటీన్లకు ఉన్న తేడాలు గమనించాలని పేర్కొన్నారు. మండలి సభ్యులు అంటే మరీ చిన్నతనంగా ఉందన్నారు.