ప్రకాశం: నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని శానిటరీ ఇన్స్పెక్టర్ నాయబ్ రసూల్ అన్నారు. పట్టణంలోని కిరాణా షాపులలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా రసూల్ మాట్లాడుతూ.. నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వినియోగిస్తున్న, విక్రయిస్తున్న దుకాణదారులు, హోటల్ యజమానులకు జరిమానా విధించామన్నారు.