ADB: గుడిహత్నూర్ మండలంలోని తోశం గ్రామానికి చెందిన ఉయిక భీంరావు న్యూ చెంచుఘాట్ గ్రామంలోని దిశ పబ్లిక్ స్కూల్ కు 1.10 ఎకరాల భూమిని అందజేశారు. ఈ మేరకు గోండ్వానా పంచాయతీ, రాయి సెంటర్ సభ్యులు ఆయన్ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి స్వచ్ఛందంగా ముందుకు రావడం గొప్ప విషయమని పేర్కొన్నారు.