MDK: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువును ఈ నెల 30వరకు పొడిగించినట్లు రేగోడ్ ఓపెన్ స్కూల్ అసిస్టెంట్ కో ఆర్డినేటర్ సంజీవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. అడ్మిషన్ ఫీజును తప్పనిసరిగా మీసేవ కేంద్రాల్లోనే చెల్లించాలని పేర్కొన్నారు. చదువు ఆపిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వివరాలకు https://www.telanganaopenschool.org సందర్శించారని సూచించారూ.