TG: మహారాష్ట్ర నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో తెలంగాణలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 21 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.