SRPT: హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న రాధాకృష్ణ చౌహన్‌కు అదనపు సూర్యాపేట జిల్లా న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో విధులు నిర్వహిస్తున్న మరో 45 మంది న్యాయమూర్తులకు కూడా పదోన్నతి కల్పించింది.