WGL: రాయపర్తి మండలంలోని బందనపెల్లి గ్రామ యువకుడు రాకేశ్ గ్రూప్-1 ఫలితాల్లో 491 మార్కులతో 78వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. నర్సయ్య-భాగ్యమ్మ దంపతులకు జన్మించిన రాకేశ.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాడు. ఓయూలో బీటెక్ పూర్తి చేసి, గ్రూప్స్‌లో రాణించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాడు.