HYD: బతుకమ్మ కార్నివాల్ సందర్భంగా సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు నెలకొన్నాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు ట్యాంక్‌బండ్ నెక్లెస్‌రోడ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డైవర్షన్లు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేసింది. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.