కడప: పెండ్లిమర్రి మండల సమావేశాన్ని ఎంపీపీ వరలక్ష్మీ అధ్యక్షతన నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జగన్మోహన్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు హాజరవ్వాలని ఆయన కోరారు.