MBNR: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలకు నేటి నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా 227 దుకాణాలకు టెండర్లు వేయనున్నారు. మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో 90, నాగర్ కర్నూలు 67, జోగులాంబ గద్వాల జిల్లాలో 34, వనపర్తి 36, దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుందని అధికారులు తెలిపారు.