NLG: జలసంరక్షణలో జిల్లాకు జాతీయ అవార్డు రావడంపై కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. మన జిల్లాకు ఈ అవార్డు రావడం మొదటిసారి అని, ఈ ఘనత ఉపాధి హామీ సిబ్బందికే దక్కుతుందని అన్నారు. ఇందుకు కృషిచేసిన సంబంధిత జిల్లా అధికారులు, ఉపాధిహామీ సిబ్బంది ప్రజలకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ విజయం భవిష్యత్తులో మరింత గొప్ప లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.