KMR: గాంధారి మండలం గౌరారం గ్రామంలో తెలంగాణ వీరనారి, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి చిట్యాల ఐలమ్మ జయంతిని శుక్రవారం ఉదయం రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చాకలి కిషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సాయిలు, రమేశ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.