VKB: కాంగ్రెస్ కుట్రలకు జూబ్లీహిల్స్ ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పాలని బుధవారం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో ఆమె మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఓట్లడిగే హక్కు లేదని అన్నారు. తెలంగాణలో పాలన గాడి తప్పిందని, దమ్ముంటే తనతో ప్రచారంలో వచ్చి నిరూపించాలని ఆమె సవాల్ చేశారు.