మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు టీమిండియా దూసుకెళ్లింది. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిమానులకు ఓ హామీ ఇచ్చాడు. మహిళల వన్డే ప్రపంచ కప్ భారత్ గెలిస్తే.. సెమీస్లో సెంచరీ చేసిన జెమీమాతో కలిసి పాట పాడతానని వెల్లడించాడు. అయితే, జెమీమా అందుకు అంగీకరిస్తేనేనని స్పష్టం చేశాడు.