NLG: రైతు సంక్షేమానికి కేంద్రం అనేక చర్యలు చేపడుతున్నప్పటికీ తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. చిట్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం మల్లన్న గుట్ట వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇవాళ ఆయన సందర్శించారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, BJP కార్యకర్తలు పాల్గొన్నారు.