WWCలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్‌లో టీమిండియా బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (127*) అద్భుత శతకం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆమె టీమిండియాకు స్టార్‌గా మారుతుందని 2018లోనే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సెన్ తెలిపాడు. ‘జెమీమా రోడ్రిగ్స్ పేరు గుర్తుంచుకోండి. ఆమె భవిష్యత్‌లో టీమిండియాకు స్టార్‌గా మారుతుంది’ అని చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.