BHNG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉంది. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అన్నదాతకు మొండిచెయ్యే చూపిస్తుందని రైతులు ఆవేదన వ్యక్త చేశారు. పంట నష్టపరిహారం విషయంలోనూ అదే తీరు కొనసాగిస్తున్నది. భారీ వర్షాలకు పంటనష్టం జరిగినప్పుడు హడావిడి చేసి ఆ తర్వాత చేతులెత్తేస్తున్నది. ఇప్పటి వరకు ఒక పైసా కూడా పంట నష్టపరిహారం అందలేదని జిల్లా రైతులు తెలిపారు.