పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో మొదటి ఓవర్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. అతడు ఇప్పటివరకు తొలి ఓవర్లో మొత్తంగా 24 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, గతంలో ఈ రికార్డు ఒమన్ పేసర్ బిలాల్ ఖాన్ పేరిట ఉండేది.