కోనసీమ: జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(డీఐఈవో) గా రాజమండ్రి డీఐఈవో డి. విజయశ్రీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పని చేసిన సోమశేఖర రావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఆమె ఫుల్ అడిషనల్ ఛార్జ్‌గా బాధ్యతలు స్వీకరించారు. తనకు అప్పగించిన అదనపు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని విజయశ్రీ తెలిపారు.