ఇటీవల జరిగిన పలు మ్యాచులలో టాస్ ఓడుతూ వచ్చిన భారత్.. హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20లో ఎట్టకేలకు టాస్ గెలిచింది. దీంతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడి 0-1 తేడాతో వెనుకబడిన భారత్.. ఈ మ్యాచులో గెలిచి లెక్క సమం చేయాలనే యోచనలో ఉంది.