KMR: ఎల్లారెడ్డి మండలంలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా విరుచుకుపడిన గాలివానతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతకు వచ్చిన పంటలు నేలవాలాయి. జంగంపల్లి కుర్డు, లక్ష్మాపూర్, రాంపూర్, కొట్టాల్ ప్రాంతంలోని రైతులు ఆయా ప్రాంతాలలో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.