కృష్ణా: కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యమిస్తోందని టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. నాగాయలంక మండలం పర్రచివర శివారు గణపేశ్వరంలో టీడీపీ కార్యకర్త చాట్రగడ్డ సువార్తమ్మ మే 9న రోడ్డు ప్రమాదంలో మరణించగా ఆమె భర్త బాబురావుకి ఆదివారం రూ.5లక్షలు చెక్కును కనపర్తి శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్ వెంకటేశ్వరరావు అందజేశారు.