SRPT: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ ఏజెన్సీల పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని నడిగూడెం ఎస్సై అజయ్ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరగాళ్లు లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్, వివిధ రకాల పేరుతో సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చని ఆశ చూపి మోసం చేస్తున్నారన్నారు. మొబైల్కు వచ్చే OTP చెప్పవద్దన్నారు.