ASR: జీ.మాడుగుల మండలం చిలకలమామిడి గ్రామంలో పాఠశాల భవనం నిర్మించాలని పెసా కమిటీ మండల అధ్యక్షుడు లకే రామకృష్ణ అధికారులను కోరారు. ఆదివారం పెసా కమిటీ ఉపాధ్యక్షుడు చిరంజీవినాయుడుతో గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పాఠశాల భవనం లేక, ఓ ఇంటి వరండాలో తరగతులు నిర్వహిస్తున్నారని గ్రామస్తులు ఆయనకు వినతిపత్రం అందజేశారు. దీంతో పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.