NLR: అస్వస్థతకు గురై నెల్లూరులో చికిత్స పొందుతున్న వైసీపీ ఉదయగిరి ఇంఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డిని కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇవాళ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయనకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయన వెంట మాజీ డీసీఎంఎస్ ఛైర్మన్ వీరి చలపతి, తదితరులు ఉన్నారు.