ASF: పిచ్చికుక్క దాడిలో ఒకరు గాయపడిన ఘటన రెబ్బెన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రెబ్బెన మండలం నక్కలగూడా గ్రామానికి చెందిన సంజీవ్ (30) పై కుక్క దాడి చేయడంతో కాలుకు గాయాలయ్యాయి. వెంటనే రెబ్బెనలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకున్నట్లు తెలిపారు. గ్రామంలో పిచ్చికుక్కల బెడద రోజురోజుకు పెరిగిపోతోందని అన్నారు.