PLD: సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం పిడుగురాళ్లలోని టీడీపీ కార్యాలయంలో గురజాల నియోజకవర్గానికి చెందిన 64 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.57,03,788 చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఆర్థిక స్తోమత లేనివారి చికిత్సకు ఈ నిధి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.