KKD: స్వాతంత్య్ర పోరాటానికి ప్రేరణగా నిలిచిన వందేమాతరం గీతం రచనకు 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జిల్లాలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. బంకిం చంద్ర ఛటర్జీ జయంతిని పురస్కరించుకొని భారతమాత చిత్రపటానికి ఎస్పీ, పోలీస్ అధికారులు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు.